అనంతపురం జిల్లాలో ప్యాసింజర్ ట్రైన్ సాంకేతిక లోపంతో పట్టాలపై ఆగిపోయింది. గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్తున్న ప్యాసింజర్ రైలు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో గుంతకల్లు మండలం ఇమాంపురం రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే.. గుంతకల్లు నుంచి మరో ఇంజిన్ తెప్పించి.. ట్రైన్ తిరుపతికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇదంతా సరి చేయడానికి సమయం పట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇమాంపురం రైల్వే స్టేషన్లో రెండు గంటలపాటు ఆగిపోయింది.
anantapur|Authored byతిరుమల బాబు|TimesXP TeluguUpdated: 20 Nov 2023, 1:42 pm