కొండ పైనుంచి పడిన కారు.. అనంతపురంలో విషాదం
1167 views
అనంతపురం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఅనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దేవరకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ కారు కొండ పైనుంచి కిందకు పడింది. కారును నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని అనంతపురానికి చెందిన విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ ఉమాపతిగా గుర్తించారు. డ్రైవర్ ‘సార్.. సార్..’ అంటూ వారిస్తున్నా, కారును కొండ అంచు వైపునకు తీసుకెళ్లి అక్కడ నుంచి దూకించారు. డ్రైవర్ను కిందకు దింపి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దేవరకొండ మీద దైవ దర్శనం అనంతరం.. ఉమాపతి కారు లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.