చంద్రబాబుకు బెయిల్.. పోలీసులు ఏం ప్లాన్ వేశారు!
2462 views
అనంతపురం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిAnantapur: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తలు విని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ కార్యకర్త అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించాడు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సెల్ టవర్ ఎక్కాడు. చంద్రబాబును విడుదల చేయకుంటే.. పైనుంచి దూకేస్తానని హెచ్చరించాడు. టీడీపీ కార్యకర్తను కిందికి దించేందుకు పోలీసులు తెలివిగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చిందని చెప్పి నమ్మించారు. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి..