వినాయక నిమజ్జనంలో పల్టీ వేసి.. చూస్తుండగానే మృతి
3544 views
కడప వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఅన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన వినాయక నిమజ్జనం వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా శుక్రవారం రాత్రి రాజంపేట పాత బస్టాండ్ సర్కిల్లో కిరణ్ అనే డ్రైవర్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ... ట్రాక్టర్ ముందు ఉండే బంపర్ మీద నుంచొని ఫల్టీ కొట్టాడు. ఈ క్రమంలో అతని తల రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో ఆ వ్యక్తి జీవచ్ఛంలా అక్కడికక్కడే పడిపోయాడు. వెంటనే తిరుపతి ఆస్పత్రికి తరలించగా.. తలలో నరాలు దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారు. నిమజ్జన వేడుకల్లో పాల్గొనే వారు ఇలాంటి విన్యాసాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని పలువురు కోరుతున్నారు.