YCP MLA: దగ్గరుండి కూతురికి కులాంతర వివాహం జరిపించిన ఎమ్మెల్యే
8176 views
కడప వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిKadapa: కూతురుకి కులాంతర వివాహం చేసి ఆదర్శంగా నిలిచారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (YSRCP MLA). కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దగ్గరుండి మరి కూతురికి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కూలాంతర వివాహం (Inter Caste Marriage) చేశారు. కే లీలా గోపీ పవన్ కుమార్ను తన మొదటి కుమార్తె పల్లవి ప్రేమించింది. దాంతో కూతురి ప్రేమను గౌరవించి ఎమ్మెల్యే వారిద్దరికి పెళ్లి జరిపించారు. మొదట నిరాడంబరంగా , సాంప్రదాయ బద్దంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల మధ్య వివాహం జరిగింది. అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు ఎమ్మెల్యే రాచమల్లు. తాను నిరాడంబరంగా తన మొదటి కుమార్తె పల్లవి ప్రేమ, కులాంతర వివాహానికి ఒప్పుకుని ఆశీర్వదించాను అన్నారు. పేదవాడైన పవన్ను కలిసి చదువుకున్న రోజుల్లో పల్లవి ఇష్టపడటంతో పెళ్లి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.