మందు తాగడానికి డబ్బులివ్వలేదని స్నేహితుడి దారుణ హత్య
26758 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండికర్నూలు జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. మందు తాగడానికి డబ్బులివ్వలేదనే కోపంలో స్నేహితుడిని చంపాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కోసిగి మండలం నేలకోసిగి గ్రామానికి చెందిన వీరయ్య దగ్గరికి.. బసవరాజు అనే స్నేహితుడు వచ్చాడు. ఊర్లోకి వెళ్లి మందు తాగుతా.. ఓ వంద రూపాయలు ఇవ్వమని బసవరాజు తన స్నేహితుడు వీరయ్యని అడిగాడు. తన దగ్గర లేవని వీరయ్య సమాధానమిచ్చాడు. ఎలాగైనా ఓ వంద రూపాయలు ఇవ్వాలని బసవరాజు గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. ఇంతలోనే ఆక్రోషానికి లోనైనా బసవరాజు అందరూ చూస్తుండగానే వీరయ్య గొంతును.. రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. వదలమని.. విదిలించుకునే ప్రయత్నం చేసినా వీరయ్యను వదల్లేదు. కోపంతో ఊగిపోతూ గొంతును గట్టిగా నులుముతూనే ఉన్నాడు. కసితీరా పీక పిసికి ప్రాణాలు తీశాడు. అందరూ చూస్తుండగానే వీరయ్య కుప్పకూలాడు.