ఢిల్లీలో నారా లోకేష్‌ను ఎవరూ పట్టించుకోలేదు: కాకాణి
మాజీ సీఎం చంద్రబాబు తన నైపుణ్యాన్ని ప్రదర్శించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.371 కోట్లు దోచుకున్నారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్ నిర్మాతల వద్ద రెమ్యూనరేషన్ తీసుకుని కెమెరాల ముందు మాట్లాడిన విధంగానే చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని ప్రజల ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు, లోకేశ్‌లపై నమ్మకం లేక బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టుకుని జైల్లో డీల్ కుదుర్చుకున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని నాయకుల కాళ్లమీద పడి తన తండ్రిని బయటకు తెచ్చుకునేందుకు లోకేశ్ ఢిల్లీలో గడప గడపకు తిరుగుతున్నాడని అన్నారు. గతంలో అనేక కేసుల్లో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి, కోర్టులకు వెళ్లి సాంకేతిక కారణాలు చూపించి స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబాలకు మేలు జరిగితేనే తమకు ఓటు వెయ్యాలని సీఎం జగన్ ధైర్యంగా చెబుతున్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకుని ప్రజలను బలి చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
Authored byCurated byతిరుమల బాబు|TimesXP Telugu|18 Sept 2023