పవన్ కళ్యాణ్‌ని అమాయకుడిని చేసి సీట్లు తగ్గించారు: గుడివాడ అమర్నాథ్
రాజమండ్రి వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
Gudivada Amarnath - Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. పాపం పవన్ కళ్యాణ్‌ను అమాయకుణ్ని చేసి.. సీట్లు తగ్గించేశారంటూ ఎద్దేవా చేశారు. చివరకు సొంత అన్నకు కూడా పవన్ కళ్యాణ్ సీటు తెచ్చుకోలేకపోయాడని అన్నారు. "పాపం పవన్ కళ్యాణ్.. ఇవ్వక, ఇవ్వక 24 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అలాగే ఇవ్వక, ఇవ్వక 3 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ఇప్పుడేమో మళ్లీ మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు తగ్గించేశారు. చంద్రబాబేమో 145లో ఒకటి తగ్గించుకుంటాడట. పాపం పవన్ కళ్యాణ్ మాత్రం ఉన్న 24 సీట్లలో 3 తగ్గించుకోవాలంట. దీంట్లో ఏమైనా న్యాయం ఉందా? పాపం పవన్ కళ్యాణ్‌ను అమాయకుణ్ని చేసేశారు. పక్కనుండే నాదెండ్ల మనోహర్ ఏం చెప్తున్నాడో. ఏమో?. మాది తెనాలీ, మీది తెనాలీ అనుకుంటూ వాళ్లేం చేస్తున్నారో.. ఈ అమాయకుడు మధ్యలో కూర్చుని ఏం చేస్తున్నాడో..? జనసేన కార్యకర్తలకు, జనసేన నేతలకు ఏం సమాధానం చెప్తాడో?" అని గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.