ఆదిరెడ్డి అప్పారావుకు ఎంపీ మార్గాని భరత్ వార్నింగ్
1178 views
రాజమండ్రి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిటీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధం సభ వేదికగా చెప్పు చూపించి మరీ అప్పారావుకు భరత్ వార్నింగ్ ఇచ్చారు.ఓ మహిళా వాలంటీర్ను ఆదిరెడ్డి అప్పారావు బెదిరించినట్లుగా ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోన్ కాల్ ద్వారా మహిళా వాలంటీర్ను అప్పారావు బెదిరించినట్లు ఆడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో జరిగిన సిద్ధం సభలో పాల్గొన్న ఎంపీ మార్గాని భరత్.. అప్పారావుపై మండిపడ్డారు. వాలంటీర్ను ఆదిరెడ్డి అప్పారావు బెదిరించాడన్న మార్గాని భరత్.. బహిరంగ సభలోనే దీనికి సంబంధించిన ఆడియోను వినిపించారు. వాలంటీర్లను ఇలా బెదిరించేవారికి చెప్పు చూపిద్దామంటూ హెచ్చరించారు.