కాకినాడ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరు మత్స్యకారులు మృతి
1061 views
rajahmundry వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండికాకినాడ తీరంలో పడవ తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందారు. సోమవారం రాత్రి సూర్యారావుపేట నుంచి హోప్ ఐల్యాండ్ వరకు ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేట ముగించుకొని తిరిగి వస్తుండగా అలల దెబ్బకు పడవ తిరగడింది. ఈ ఘటనలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు దుమ్మలపేటకు చెందిన మైలపల్లి కృపాదాస్, సూర్యరావుపేటకు చెందిన సత్తిరాజుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. పడవ తిరగబడి సముద్రంలో పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన విషయాన్ని కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారుల మృతి విషయాన్ని తెలుసుకున్న సీఎం వెంటనే ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు నష్టపరిహారం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు.