మరీ ఇంత నీచంగా మాట్లాడతారా.. శివాలెత్తిపోయిన శివగామి
130261 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండినటి రమ్యకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. తన స్నేహితురాలు మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల సినీ నటి రమ్యకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా దూషించడం దారుణమని మండిపడ్డారు. మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ దుయ్యబట్టారు. బండారు సత్యనారాయణని క్షమించకూడదన్నారు. మన దేశం ప్రపంచంలోనే 5వ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని.. అలాంటి దేశంలో ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు రమ్యకృష్ణ.