సమంత పెద్ద మనసు.. దివ్యాంగుడి కోసం ఆగి మరీ ఫోటో
2132 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీనటి సమంత దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే దర్శనం తర్వాత ఆలయం బయటకు వచ్చిన సమంతతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు అక్కడున్న భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో సమంత చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సమంత మంచి మనసును అభినందిస్తున్నారు. సమంతతో ఫోటో దిగేందుకు ఓ దివ్యాంగుడు అక్కడే నిరీక్షిస్తూ ఉన్నారు. సమంత ఆలయం బయటకు రాగానే ఆమెతో ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్తున్న సమంత ఆగిమరీ.. ఆయనతో ఫోటో దిగారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . సమంత చేసిన పనిని నెటిజనం ప్రశంసిస్తున్నారు .