టమాటా సాగుతో రూ.3 కోట్లు సంపాదించిన అన్నదమ్ములు
3183 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిచిత్తూరు జిల్లా సోమల మండలం కరకమందకు చెందిన చంద్రమౌళి, అతని తమ్ముడు మురళిది టమటాలు సాగు చేసి రూ.3 కోట్ల లాభం పొందారు. వీరికి కరకమంద సమీపంలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపువార పల్లెలో పది ఎకరాల పొలం ఉంది. గత కొన్నే్ళ్లుగా టమాటా సాగుచేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు.. ప్రతి ఏటా జూన్ నాటికి దిగుబడి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటూ టమాటా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 70 లక్షల వరకూ పెట్టుబడితో 22 ఎకరాల్లో సాహు రకానికి చెందిన టమాటా వీరు సాగుచేశారు. జూన్ నుంచి దిగుబడి ప్రారంభం కాగా.. మార్కెట్లో టమాటా ధర ఎక్కువగా ఉండటంతో వీరి పంట పండింది. టమాటా పంటను కర్ణాటకలోని కోలార్ మార్కెట్లో వీరు విక్రయిస్తూ వచ్చారు. కోలార్ మార్కెట్లో 15 కేజీల బాక్స్ ధర రూ.1000-1500 మధ్య పలికింది. ఇప్పటివరకు సుమారుగా ఈ అన్నదమ్ములిద్దరూ సుమారుగా 40 వేల బాక్సుల టమాటాలను విక్రయించగా... అన్ని ఖర్చులు పోనూ సుమారు మూడు కోట్లకుపైగా ఆదాయం వచ్చింది.