చిత్తూరు: ఏనుగు దాడిలో దంపతులు మృతి
22065 views
tirupati వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిChittoor: చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు హల్చల్ చేసింది. బంగారుపాళ్యం మండలం మొగలివారిపల్లెలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి ఒక ఏనుగు దారి తప్పింది. ఆ ఒంటరి ఏనుగు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను (Elephant Attack) హడలెత్తిస్తోంది. ప్రజలపై దాడి చేస్తూ ప్రాణాలు బలిగొంటోంది. దీంతో గ్రామ ప్రజలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే వణికిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం గుడిపాల మండలంలోని రామాపురం, సీకే పల్లి గ్రామాల్లో సంచరించిన ఓ ఏనుగు పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లిన దంపతులు వెంకటేశ్, సెల్విపై దాడి చేసి చంపేసింది. మొగలివారిపల్లి, జయంతి, టేకుమంద గ్రామాల్లో ఘీంకారం చేస్తూ ప్రజలను హడలెత్తించింది. దాంతో ఏనుగు తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని సమీప గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.