పలమనేరు సమీపంలో ఏనుగుల గుంపు.. పంటలు ధ్వంసం
1240 views
tirupati వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిచిత్తూరు జిల్లా వీ కోట మండలం నాగిరెడ్డి పల్లి పరిధిలోని పంటలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. కోత దశలో ఉన్న పంటను కాళ్లతో తొక్కి.. ఆరగించిన ఏనుగులు ఎక్కడికక్కడ పాడు చేశాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 15 ఏనుగులు గుంపుగా వచ్చి పంటలపై పడటంతో రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏనుగుల గుంపు గ్రామాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవలే రామకుప్పం సమీపంలోని పంటపొలాలపై ఏనుగులు దాడి చేశాయి. ఆ ఘటనపై ఏపీ ఫారెస్ట్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. మళ్లీ తాజాగా వీ కోట మండలంలో ఏనుగుల గుంపు పంటలపై పడి ధ్వంసం చేస్తున్నాయని రైతులు అంటున్నారు.