కాణిపాక వర సిద్ధివినాయకుడి ఆలయంలో వేడుకగా బ్రహ్మోత్సవాలు
సత్య ప్రమాణాల సన్నిధి చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కాణిపాక వర సిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తజనం తరలివస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యే గణనాథుడి బ్రహ్మోత్సవాలు 21 రోజులపాటు జరగనుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అక్టోబర్ 8న తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనుండగా.. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లను చేసిన ఆలయ యంత్రాంగం వరసిద్ధి వినాయక సన్నిధిని అలంకరించింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తజనం తరలివస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశారు. లఘు దర్శనానికి మాత్రమే అధికారులు అవకాశం కల్పిస్తున్నారు.
Authored byCurated byతిరుమల బాబు|TimesXP Telugu|18 Sept 2023