కపిలేశ్వరాలయంలో కార్తీక శోభ.. కార్తీకమాసంలో ఐదు వారాలపాటు ఇలా చేస్తే
2349 views
tirupati వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండికార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని కలిలేశ్వర ఆలయంలో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది. ఆ శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వెళ్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి దేవుని దర్శించేందుకు కపిలేశ్వరాలయానికి మహిళలు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో గల మాల్వాడి గుండం నుంచి జాలువారుతున్న నీటితో పుణ్య స్మానాలు ఆచరించి తడి బట్టలతోనే కలిలేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గుడి మెట్లపై పిండి దీపాలు వెలిగించి తమ కోర్కెలు తీర్చాలని ఆ ముక్కంటి ఈశ్వరుడిని వేడుకుంటున్నారు. ఇలా ఐదు వారాలపాటు నిష్ఠగా ఆ పరమేశ్వరుడిని కొలిస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని భక్తుల విశ్వాసం.