తిరుమలలో చిరుత, ఎలుగుబంటి సంచారం.. అలిపిరి నడక మార్గంలో మళ్లీ అలజడి
2057 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం (Leopard and Bear Roaming at Tirumala Walkway) అలజడి రేపుతోంది. తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నాయని టీటీడీ తెలిపింది. ఈనెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో ఒక చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరా ట్రాప్ లో నమోదైంది. తిరుమల నడకదారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. నడకదారిలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు గుంపులు గుంపులుగానే వెళ్లాలని సూచించింది.