శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం.. కైలాసగిరుల్లో మంటలు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధం ఆలయంలో ఒక్కటైన బావి (భరద్వాజ తీర్థం) గోశాలకి అతి సమీపంలోని కైలాసగిరుల్లో మంటలు చెలరేగాయి. సాయంత్రానికి మంటలు భారీగా అలముకున్నాయి.. అయితే విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఆలయ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు మంటలు శ్రీకాళహస్తి ఆలయ గోశాల వైపుకు రాకుండా అదుపు చేశారు. కైలాసగిరిలో మంటలు అదుపులోకి తీసుకుని రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.tirupatiTimesXP TeluguUpdated: 13 Apr 2023, 12:52 pm