తిరుమల శ్రీవారికి ఘనంగా పుష్పయాగం
1021 views
tirupati వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం కనులపండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి సహస్ర దీపాలంకార సేవలో పాల్గొన్నారు. ఆపై మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. పుష్పయాగం సందర్భంగా ఉదయం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్నపన తిరుమంజనంలో భాగంగా విశేష అభిషేకం చేశారు. ్యతిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో ఆదివారం రాత్రి పుష్పయాగాన్ని కనులపండువగా నిర్వహించారు. అమ్మవారికి సోమవారం మహంతు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈవో రమేష్ పాల్గొన్నారు.