తిరుపతిలో వైభవంగా కార్తీక దీపోత్సవం
2464 views
tirupati వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితిరుపతిలో కార్తీక దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. గోవిందనామస్మరణతో టీటీడీ పరిపాలన భనవం మైదానం మార్మోగింది. భక్తులు భారీఎత్తున హాజరై దీపాలు వెలిగించారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులతో టీటీడీ కార్తీక దీపోత్సవం వేడుకగా నిర్వహించింది. కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి తోపాటు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. దైవనామాన్ని జపిస్తే దీర్ఘాయువు కలుగుతుందన్నారు అతిథులు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీనివాసుని కటాక్షం కలగాలని స్వామీజీ ఆకాంక్షించారు. ఇక దీపోత్సవం జ్ఞాన జ్యోతులు వెలిగించాలన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి.