తిరుమల బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
Tirupati: తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుఫున తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. టీటీడీ ఛైర్మన్ భూమన, ఆలయ అర్చకులు.. సీఎం జగన్కు పరివట్టం కట్టారు. అనంతరం ఆయన పట్టువస్త్రాలను సమర్పించారు. సోమవారం (సెప్టెంబర్ 18) రాత్రి 9 గంటలకు జరిగిన పెద్ద శేష వాహన సేవలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్ వెంట టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు.
Authored byCurated byశ్రీనివాస్ గంగం|TimesXP Telugu|18 Sept 2023