శ్రీవారి సేవలో మాజీ రాష్ట్రపతి దంపతులు
Tirupati: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (సెప్టెంబర్ 18) ఈ ఉదయం విఐపి దర్శన విరామ సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం దర్శనాంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులందరిన ప్రేమగా పలకరించారు. కా ఆదివారం (సెప్టెంబర్ 17) తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని రామనాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Authored byCurated byవరప్రసాద్ మాకిరెడ్డి|TimesXP Telugu|18 Sept 2023