అమెరికా పర్యటనలో ఏపీ విద్యార్థులకు అరుదైన ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఏపీ ప్రభుత్వం విద్యాసంస్కరణలో తీసుకోచ్చిన మార్పుల కారణంగా ఈ అరుదైన అవకాశం లభించింది . ఈ నేపథ్యంలో నూతన విద్యా సంస్కరణల ద్వారా ఫలాలు అందుకున్న తెలుగు విద్యార్థులకు ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం లభించింది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదిమంది విద్యార్థుల బృందం అమెరికాలో రెండు వారాలు పర్యటించనుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఈ చిన్నారుల బృందం ఇప్పటికే అగ్రరాజ్యంలో అడుగుపెట్టింది.అమెరికాలో అడుగుపెట్టిన తెలుగు విద్యార్థులకు మరో అరుదైన ఆహ్వానం కూడా అందింది. ఈ బృందాన్ని వరల్డ్ బ్యాంక్.... యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్... ఇంకా కొలంబియా యూనివర్సిటీతో పాటు.... వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌ను సందర్శించాలని అమెరికా అధికారులు ఆహ్వానించారు. దీనిపై విద్యార్థుల బృందం సంతోషం వ్యక్తం చేసింది.
Authored byCurated byతిరుమల బాబు|TimesXP Telugu|18 Sept 2023