చంద్రబాబుకు పెద్ద ఊరట.. స్కిల్ కేసులో బెయిల్
1257 views
vijayawada వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిChandrababu Naidu bail: తెలుగు దేశం పార్టీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు నవంబర్ 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని జస్టిస్ టి మల్లికార్జున్ రావు తీర్పు వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు నవంబర్ 28 వరకే వర్తిస్తాయని స్పష్టం చేశారు. 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే, నవంబర్ 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు నాయుడు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో సమర్పించాలని తీర్పులో పేర్కొన్నారు.