పవన్ ప్యాకేజీ స్టార్‌గా మాత్రమే హిట్ అయ్యారు: మంత్రి రోజా
Vijayawada: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పిచ్చి పీక్స్ చేరిందన్నారు. ఆదివారం (సెప్టెంబర్ 17) తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రోజా జనసేన- టీడీపీ పొత్తు హిట్ అయిందనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ విషయంలో మాత్రమే పవన్ హిట్ అయ్యాడని రోజా విమర్శించారు . ఢిల్లీ వెళ్లి పవన్ కల్యాణ్ ఏదో చెప్తారట అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ విషయంలో మాత్రమే పవన్ హిట్ అయ్యారని విమర్శించారు. ఢిల్లీ వెళ్లి పవన్ కల్యాణ్ ఏదో చెప్తారట అని సటైర్లు విసిరారు. పవన్‌ను అమిత్ షా అమిత్ షా గెంటేస్తారన్నారు. తాము ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నామని, అయితే 10 చోట్లనైనా జనసేనకు అభ్యర్థులు ఉన్నారా అని రోజా ప్రశ్నించారు.
Authored byCurated byశ్రీనివాస్ గంగం|TimesXP Telugu|17 Sept 2023