జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ దిగి పెడతా మానవత్వం ఉంటే సమాధానం చెప్పు: చంద్రబాబు
మచిలీపట్నంలో విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది అని ప్రశ్నించారు చంద్రబాబు. 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా అంటూ మండిపడ్డారు. ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా అన్నారు.