నాకైతే ఎవరితో అక్రమ సంబంధాలు లేవు: కేశినేని నాని
టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్పై కేశినేని నాని ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. ఆయనపై పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ పరిణామాలపై కేశినేని నాని స్పందిస్తూ.. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్లని అభినందిస్తానన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే.. కేశినేని భవన్లో కూర్చొని విజయవాడ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తాను, తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదన్నారు. తనకు ఎవరితోనూ అక్రమ సంబంధాలు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు.vijayawadaTimesXP TeluguUpdated: 22 May 2023, 6:40 pm