విజయవాడలో స్ఫూర్తి కుటుంబం మహిళా దినోత్సవం.. ఆకట్టుకున్న సింధూరి నాట్యం
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
విజయవాడలోని కే. ఎల్. రావు భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారి అనుగ్రహ ఆశీస్సులతో .. స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ స్త్రీ శక్తి సోషల్ స్ఫూర్తి విభాగం వేడుకలను ఘనంగా నిర్వహించింది. శక్తి అంటే కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే సమాజం కోసం, మానవత్వం కోసం పాటుపడేది అని గురుదేవులు వివరించినట్లు వక్తలు తెలిపారు. భావి తారలను తీర్చి దిద్దే బాధ్యత, తద్వారా నవ సమాజాన్ని నిర్మించే బాధ్యత, ఆర్ధిక వ్యవహారాలు, సంస్కృతి పరిరక్షణలో స్త్రీది జన్మ హక్కని, అదే బాధ్యత అనీ గురుదేవులు వివరిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా.. చిరంజీవి సింధూరి చేసిన నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. స్ఫూర్తి కుటుంబం ఆధ్వర్యంలో స్త్రీలందరికీ వైద్య పరీక్షలు కూడా నిర్వహఇంచారు.