Mehreen Pirzada: విజయవాడలో జరిగిన టైమ్స్ బిజినెస్ అవార్డ్ ఫంక్షన్లో నటి మెహ్రీన్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సమయం తెలుగుతో ఛానల్‌తో మాట్లాడుతూ.. తెలుగులో తన ఫస్ట్ మూవీ ( కృష్ణగాడి వీర ప్రేమగాథ) లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అన్నారు. మూవీ టైం తనకు ఆడియన్స్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ తనని ఇంకా స్ట్రాంగ్ చేశాయని, మరిన్ని సినిమాలు చేసేలా ఆడియన్స్ కామెంట్స్, మెసేజ్‌లు తనని మోటివేట్ చేశాయన్నారు.