నా భర్తకి నేను రెండో భార్యను.. తనకి అదే ఫస్ట్: నటి శ్రియా
10642 views
విజయవాడ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిVijayawada: తెలుగు ఆడియన్స్ ప్రేమ, అభిమానం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని (shriya About Her Husband) అన్నారు హీరోయిన్ శ్రియా సరన్. విజయవాడలో శుక్రవారం (సెప్టెంబర్ 29) జరిగిన టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో శ్రియా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆమె అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన లైఫ్‌లోకి స్మాల్ అండ్ బిగ్ మూమెంట్స్ వస్తూనే ఉంటాయని, అవి మనమేంటో మనం తెలుసుకునేలా చేయస్తాయన్నారు. తెలుగు ఆడియన్స్ ఆదరణ వల్లే తాను ఇక్కడ ఉన్నానని, అందుకు నేను చాలా కృతజ్ఞురాలిని అని పేర్కొన్నారు. అనంతరం తన భర్త సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని, అతడు చాలా కష్టపడతాడని తెలిపారు. నిజానికి బిజినెస్ ఆయన ఫస్ట్ భార్య అని తాను రెండో భార్య లెక్క అంటూ శ్రియా చెప్పుకొచ్చారు.