బండికి చలానా వేశారని పోలీసులకు కరెంట్ కట్ చేసిన విద్యుత్ సిబ్బంది
5092 views
విశాఖపట్నం వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిTraffic Challan: తమ బైక్‌కు ఫైన్ వేశారని ఏకంగా పోలీస్ హెల్ప్ డెస్క్‌కే కరెంట్ కట్ చేశారు విద్యుత్ సిబ్బంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ శాఖకు చెందిన కొంత మంది ఉద్యోగులు బైక్ మీద వెళ్తూ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడంతో.. ట్రాఫిక్ పోలీసులు గుర్తించి, ఫోటోలు తీసి వారికి ఫైన్ విధించారు. ఇది విద్యుత్ సిబ్బందికి ఆగ్రహం తెప్పించింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కాసేపటికి జిల్లా కేంద్రంలోని పోలీస్ హెల్ప్ డెస్క్‌కు విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ వైరును కట్ చేశారు. వాహనానికి చలానా విధించామనే.. కరెంట్ నిలిపివేశారా అని పోలీసులు ప్రశ్నించగా.. ఏం సమాధానం చెప్పారో వీడియోలో చూడండి..