ప్రారంభించిన రెండో రోజే కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి
1132 views
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిVizag: విశాఖపట్నం ఆర్కే బీచ్లో అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి రెండో రోజే తెగిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జిలో చివరి భాగమైన ఫ్లాట్పామ్ తెగిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో అదృష్టవశాత్తూ ఫ్లాట్పాం మీద పర్యాటకులు ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్ వద్ద వైఎంసీఏ సమీపంలో నిర్మించిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఆదివారం (ఫిబ్రవరి 25) మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని సుమారు కోటీ 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణ సమయంలోనే కొంత మంది నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్కే బీచ్లో అలల తీవ్రత ఎక్కువని, తేలియాడే ఫ్లోటింగ్ బ్రిడ్జిలు కొట్టుకుపోవచ్చునని.. ప్రమాదాలకు దారి తీయవచ్చునని సూచించారు.