విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం
1092 views
visakhapatnam వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండివిశాఖలోని ఫిషింగ్ హార్బర్లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో బాధిత కుటుంబసభ్యులు బోరున విలపించారు. అలాగే బాధిత కుటుంబాలు, స్థానిక మత్స్యకారులు హర్బర్‌లో ధర్నాకు దిగారు. పోలీసులు పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఓ యూట్యూబర్‌ను పాత్రపై అనుమానిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సీపీ స్వయంగా రంగంలోకి దిగి కేసును పర్యవేక్షిస్తున్నారు.