మంత్రి రోజాకు వంగలపూడి అనిత కౌంటర్..
visakhapatnam: వైసిపి మంత్రి రోజా వ్యాఖ్యలపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రహ్మణిపై రోజా చేసిన కామెంట్స్‌పై ఆమె ధ్వజమెత్తారు. ఏనాడూ రాజకీయాల వైపు చూడని నారా బ్రాహ్మణి ఒక్కరోజు బయటికి వచ్చి కొవ్వొత్తి పట్టుకునే సరికి వైసీపీ నేతలు ఎందుకింత వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి రోజాకు ఐటీకి, ఇన్కమ్ ట్యాక్స్‌కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అనంతరం బ్రహ్మణి చదువుపై రోజా చేసిన కామెంట్స్‌కి అనిత కౌంటర్ విసిరారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..'అమ్మా రోజా నారా బ్రాహ్మణి గారు ఏం చదువుకున్నారో తెలుసా? చెరువు కట్ట దగ్గర చదువు అనుకున్నావా? ఇంటర్ ఫెయిలైన నువ్వు నారా బ్రాహ్మణికి చదువు చెప్పిన గురువుల గురించి మాట్లాడుతున్నావు చూడూ నిజంగా ప్రజాస్వామ్యానికి హేట్సాఫ్ చెప్పాలి' అంటూ ఎద్దేవా చేశారు.
Authored byCurated byశ్రీనివాస్ గంగం|TimesXP Telugu|18 Sept 2023