మంత్రి మల్లారెడ్డి మాస్ డైలాగ్స్‌తో టెన్త్ స్టూడెంట్ సెలబ్రేషన్స్
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్సాహంతో సంబురాలు చేసుకుంటున్నారు. అందరు విద్యార్థులేమో కానీ.. విశాఖపట్నంలోని మధురవాడకు చెందిన ఓ విద్యార్థి పాసవటం.. అతని కంటే.. అతని స్నేహితులకు ఇంకా ఎక్కువ ఆనందాన్నిస్తోంది. తమ ఫ్రెండ్ పదో తరగతి పాసవటం వెనుక ఉన్న కష్టాన్ని అందరికి తెలియజేసేలా.. గట్టిగానే సంబరాలు చేశారు. మంత్రి మల్లారెడ్డి డైలాగులతో ఉన్న డీజే పాటలకు డాన్సులు వేసి.. హంగామా చేశారు.