అరటిపండ్లలో ఉండే.. పొటాషియం, మాంగనీస్ సమృద్ధిగా చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. మాంగనీస్ మన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజెన్ వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తుంది. పొటాషియం చర్మ కణాలకు ఆక్సిజన్, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కాంతివంతమైన చర్మం పొందడానికి అరటిపండు ఫేస్ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.