ఇదేందయ్యా ఇదీ.. బనియన్-షార్ట్స్‌లో వెళ్లి పెళ్లాడిన ఆమిర్ ఖాన్ అల్లుడు
1831 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిబాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ పెళ్లి చేసుకుంది. గతకొంతకాలంగా నుపుర్ శిఖారేతో రిలేషన్షిప్లో ఉన్న ఇరా ఖాన్.. నుపుర్‌ను రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంది. ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ఎండ్లో వీరిద్దరి పెళ్లి జరిగింది. పేపర్ల మీద వధూవరులు సంతకాలు చేసిన అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకకు ఆమిర్‌ఖాన్‌తో పాటుగా ఆమిర్ మాజీ భార్యలు కిరణ్ రావ్, రీనా దత్, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. రిసెప్షన్ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్ పర్సన్ ముఖేష్ అంబానీ దంపతులు హాజరయ్యారు. మరోవైపు వివాహానికి ఆమిర్ ఖాన్ అల్లుడు డిఫరెంట్ స్టైళ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఫిట్నెస్ ట్రైనర్ అయిన నుపుర్ ముంబైలోని శాంటా క్రూయిజ్ నుంచి వివాహ వేదిక వరకూ జాగింగ్ చేస్తూ వచ్చారు. సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం నుపుర్ అతని స్నేహితులు జాగింగ్ చేస్తూ రావటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.