AP: అభిమానుల మృతి.. అండగా ఉంటానని హీరో సూర్య హామీ
2756 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిHero Suriya: ఏపీలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన అభిమానుల కుటుంబసభ్యులతో హీరో సూర్య మాట్లాడారు. వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలోని మోపువారి పాలెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు హీరో సూర్య అంటే అభిమానం. సూర్య పుట్టినరోజు నేపథ్యంలో ఆదివారం (జూలై 23) తెల్లవారుజామున ఫ్లెక్సీలు కట్టాలని నిర్ణయించుకున్నారు. ఫ్లెక్సీకి ఉన్న ఇనుప ఫ్రేమ్ ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కరెంట్ షాక్కు గురై వెంకటేష్, సాయి అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన అభిమానులు మరణించిన విషయం తెలుసుకున్న సూర్య.. మృతుల కుటుంబాలను వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. వాళ్లకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. వెంకటేష్ సోదరి తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం ఇప్పించమని కోరగా.. సూర్య తప్పకుండా తన బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వారి కుటుంబాలకి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని చెప్పి ధైర్యం నింపారు.