తిరుమల శ్రీవారి ఆలయం ‘ఆదిపురుష్’ చిత్ర దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ ప్రవర్తన వివాదాస్పదమైంది. దర్శనానంతరం ఆలయం బయటికి వచ్చిన కృతి సనన్‌ను ఓం రౌత్ ముద్దుపెట్టుకుని ఆలింగనం చేసుకోవడం వివాదానికి దారితీసింది. పుణ్యక్షేత్రంలో ఇవేం పనులంటూ పలువురు విమర్శిస్తున్నారు.