బురదలో చేయి పెడితేగానీ తెలీదు.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన అల్లు అర్జున్
5100 views
cinema వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి‘మంగళవారం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ గురించి గొప్పగా చెప్పారు. తన ఫ్యాన్స్ ఆర్మీలా తనకు అండగా ఉంటారని బన్నీ చెప్పారు. అభిమానులే తన బలమన్నారు. తనకు ఫ్యాన్సే స్ఫూర్తి అన్న అల్లు అర్జున్.. వాళ్లందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. అజయ్ భూపతి తీసిన ఆర్ఎక్స్ 100 సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. మంగళవారం టీజర్, ట్రైలర్ తనకు ఎంతో బాగా నచ్చాయన్నారు. తాను పుష్ప షూటింగ్ నుంచే ఇక్కడికి వచ్చానన్నారు. 2024లో ఆగస్టు 15న సినిమా రిలీజ్ అవుతుందన్నారు. నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత తనకు ఇదే ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అన్నారు.