Baby : ఓ నటుడికి ఇంతకంటే ఏం కావాలి.. చిరుపై ఆనంద్ దేవరకొండ
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ తన బేబి సినిమా సక్సెస్ అవ్వడంతో ఉప్పొంగిపోతోన్నాడు.. మా అన్న విజయ్ దేవరకొండ వచ్చి సక్సెస్ సెలెబ్రేషన్స్ అన్నాడు.. మొన్న ఐకాన్ స్టార వచ్చి అప్రిసియేషన్ ఈవెంట్ అన్నారు.. ఇప్పుడు మన ఈవెంట్‌కి మెగాస్టార్ వచ్చార్రా.. చిన్నప్పుడు ఇంట్లో చిరంజీవి సినిమాలకు తీసుకెళ్లమని ఏడ్చేవాడ్ని.. తెరపై ఆయన్ను చూసి ఇలా ఉండాలని అనుకునేవాడ్ని.. ఈ రోజు ఇలా నా సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్‌కు రావడం, మా మధ్య కూర్చుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండటం.. ఓ నటుడికి ఇంతకంటే ఏం కావాలి అంటూ ఆనంద్ ఎమోషనల్ అయ్యాడు.