‘కొబ్బరిమట్ట’ తీసినప్పుడు తిట్టారు: ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్
1215 views
cinema వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిసంపూర్ణేష్ బాబుతో తాను ‘కొబ్బరిమట్ట’ సినిమా తీసినప్పుడు తనను అందరూ ట్రోల్ చేశారని, తిట్టారని ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ అన్నారు. కానీ, సంపూతో కలిసి రాజమండ్రి వెళ్లి అక్కడ థియేటర్‌కు వెళ్తే ఒక ఆటో డ్రైవర్ సినిమాను ఎంజాయ్ చేస్తున్న తీరు చూసి తాను ఇలాంటి సినిమాలే తీయాలని ఫిక్స్ అయ్యానని అన్నారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు ఎంజాయ్ చేసే విధంగానే తన సినిమాలు ఉంటాయన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్యపాత్రలు పోషించిన ‘బేబీ’ సినిమా సంచలన విజయం సాధించింది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో చిత్ర బృందం సోమవారం విజయోత్సవ వేడుకను నిర్వహించింది.