Hyderabad: బిగ్‌బాస్ ఫేమ్, నటి హిమజ జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. స్కిన్ అండ్ హెయిర్ కేర్‌కు సంబంధించిన GA లాంజ్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలో హిమజ బంగారు వర్ణం చీరను ధరించి ఆకట్టుకున్నారు. అందం అంటే చర్మ సౌందర్యం, ఆకర్షణీయమైన జుట్టు మాత్రమే కాదని.. బ్యూటీ అంటే ఆత్మ సౌందర్యం అని ఆమె పేర్కొన్నారు. ఇలా అన్ని సౌకర్యాలు కల్పించే జీఏ లాంజ్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హిమజతో పాటు మిస్సెస్ తెలంగాణ అవార్డు గ్రహీత వెంగాల నిఖిల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
cinema|Authored byశ్రీనివాస్ గంగం|TimesXP TeluguUpdated: 20 Nov 2023, 6:00 pm