పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడు.. బ్రహ్మానందం ప్రశంసల వర్షం
1876 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి‘బ్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నవ్వులు పూయించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఆయన పొగిడిన తీరు కూడా అందరినీ నవ్వించింది. పవన్ కళ్యాణ్‌ను దైవాంశ సంభూతుడు అన్న బ్రహ్మానందం.. ఆయన నవ్వు పత్తికాయ పగిలినప్పుడు బయటికి వచ్చే తెల్లని పత్తిలా స్వచ్ఛంగా ఉంటుందని అన్నారు. తన నవ్వును పత్తికాయతో పోల్చగానే పవన్ కళ్యాణ్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. అలాగే, పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన బ్రహ్మానందం.. అరవడం కాదని పవన్ కళ్యాణ్‌ను వెనకే ఉండి ఆయనకు విజయాన్ని అందించాలని పరోక్షంగా రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా ఈనెల 28న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.