డిశ్చార్జ్ అయ్యాక మీ ఇంటికొస్తా.. కేసీఆర్‌కి చిరంజీవి పరామర్శ
2322 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండితెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (KCR) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. సోమాజీగూడలోని యశోద హాస్పిటల్లో కేసీఆర్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన రాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్రూంలో కేసీఆర్ జారిపడడంతో ఆయన ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. ఆయనకి సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ వైద్యులు శుక్రవారం రాత్రి కేసీఆర్‌కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు. ఆయన్నిఈరోజు సాయంత్రం చిరంజీవి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ సైతం ఇండస్ట్రీ బాగోగులు గురించి చిరంజీవిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని, త్వరితగతిన కోలుకుంటున్నారని చెప్పారు.