సాయితేజ్‌కు స్టేజీపైనే ముద్దు పెట్టిన కలర్స్ స్వాతి
14752 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిColors Swathi: యువ హీరో సాయిధరమ్ తేజ్‌కు వేదికపైనే ముద్దు పెట్టారు కలర్స్ స్వాతి. ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఇందులో పెడార్థాలు వెతుక్కోవాల్సిన పనిలేదు. ఎందుకంటే వీళ్లిద్దరూ కాలేజీ రోజుల్లో నుంచే చాలా మంచి స్నేహితులు. సాయితేజ్, స్వాతి కలిసి బీఎస్సీ చదువుకున్నారట. కాలేజీలో వీరిద్దరితో పాటు మరో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ స్వయంగా ‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పారు. కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన సినిమా ‘మంత్ ఆఫ్ మధు’. ఈ సినిమా ద్వారా ఇండో అమెరికన్ నటి శ్రేయా నవేలి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది.