నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. డైరెక్టర్ మారుతి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సురేష్ నారెడ్ల ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూర్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సమర్పిస్తున్న ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.