హీరో సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత ‘టక్కర్’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆదివారం ఈ చిత్ర ప్రిరిలీజ్ ఈవెంట్ జరగ్గా.. డైరెక్టర్ వెంకటేష్ మహా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలోని అనేక దశల్లో సిద్ధార్థ్ తన సినిమాలతో ఎలా ఇన్స్పైర్ చేశాడో చెప్పుకొచ్చాడు.