కుమారీ ఆంటీ తాజాగా బంగారు హారాన్ని కొనేసింది. అయితే అందరూ కూడా ఇప్పుడు వచ్చిన ఫేమ్ వల్లే కొనుక్కుందని అనుకుంటారని అసలు విషయాన్ని ముందే చెప్పింది. గత పన్నెండేళ్లుగా గోల్డ్ స్కీమ్ కడుతోందట. ఇది అలానే కొన్నానని అసలు విషయాన్ని చెప్పేసింది. అసలే కుమారీ ఆంటీ ఇప్పుడు ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై కుమారీ ఆంటీ సందడి చేస్తోంది. ఇక త్వరలోనే వెండితెరపై కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.